ఉగాది పండుగ విశిష్టత (The specialty of Ugadi festival)
పరిచయం
మన సాంప్రదాయం ప్రకారం ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనునది నక్షత్ర యొక్క గమనమును మరియు జన్మ ఆయుష్షులు అని అర్థాలు ఉండటం జరిగింది. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా సకల సృష్టి జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది.మరో విధంగా చెప్పాలి అంటే చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణము మరియు దక్షిణాయనములు అనునవి ద్వయం (రెండు) సంయుతం ఇందులో 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి “ఆది” అదే యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం ఏమిటంటే సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవి మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది పర్వదినం రోజున సృష్టి జరిగిందని మన పురాణ ఇతిహాసంగా చెప్పబడింది.
ఈ పండుగను కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో గొప్పగా జరుపుకుంటారు దీనినే తెలుగు సంవత్సరాది అని కూడా పిలవడం జరుగుతుంది అనగా ఉగాది తర్వాత నుండి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మన దైనందిన జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి అందువలన చాలామందికి ఉగాది పర్వదినం రోజుల చేయవలసిన సాంప్రదాయాల గురించి తెలియడం లేదు మన హిందూ పండుగలో ఉగాది ప్రత్యేక స్థానం.
ఈ పండుగను మనం కాపాడుకోవాల్సిన మరియు ఆచరించ వలసినదిఎంతగానో ఉంది. కావున మనం మన సాంప్రదాయాలను మన పండుగల ఉనికిని చాటుకోవాల్సిన తరుణం ఎంతగానో ఉంది చాలా పండుగలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అది మన బాధ్యత కూడాను.
విశిష్టత
చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి రోజున ఆ విధాత ఈ లోకమును సృష్టించారు అని ఒక నమ్మకం కలదు. అలాగే సోమకుడు వేదాలను తస్కరించిన కారణముగా ఆ శ్రీమహావిష్ణువు మత్సావతారం లో అతడిని సంహరించి వాటిని తిరిగి మరలా బ్రహ్మదేవునికి ఇవ్వటం జరిగింది. ఆ రోజే ఉగాది అని ఒక నానుడి. అప్పుడు ఆ విధాత సృష్టిని సృష్టించారు అని అంటారు చక్కటి సూర్యోదయ కాంతిలో ఆ బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారు అనే వేదాల ద్వారా మనకు అవగతం అవుతుంది.
అసలు ఉగాది పండుగని ఎందుకు చేసుకుంటారు అంటే
మన హిందు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసాన్ని మొదటి నెల గాను భావిస్తాం ఈ మొదటి నెలలో ప్రారంభమైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగను చేసుకుంటాము ఈ ఉగాది పండుగనే మహారాష్ట్రలో “గుడిపాడ్వా” చేసుకుంటారు. ప్రాంతాలు వేరైనా ఈ పండుగల యొక్క అంతరార్థం ఒకటే.
అప్పటినుంచి మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది అందుకనే అందరూ ఈ పండుగను ఎంతో విశిష్టంగాను చాలా సాంప్రదాయం గాను జరుపుకుంటారు. ఈ పండుగ ఇంకో వారం రోజులు ముందే అందరూ ఇంటిని శుభ్రపరచుకోవటం పరిసరాలను శుభ్రం చేసుకొనుట కొత్త బట్టలు ధరించడం జరుగుతుంది. అదేవిధంగా మురికి వస్త్రాలను మరియు పాత సామాగ్రిని తీసేసి, కొత్త సంవత్సరాన్ని గొప్పగా ఆహ్వానిస్తారు దీని వలన గత సంవత్సరపు ప్రతికూల అంశాలను వదిలేసి, కొత్త అనుకూల అంశాల వైపు ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం వల్ల అందరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి వాళ్ళ దైనందిని జీవితాలు చక్కగా ఉంటాయి అనటానికి ఇది మంచి ఉదాహరణ పండుగ.
ఉగాది పచ్చడి
సహజంగా మనకి పండుగ అనగానే పిండి వంటలు మరియు కొత్త వంటకాలు గుర్తుకొస్తాయి అలాగే ఉగాది పర్వదినం రోజు కూడా మనం పర్యావరణ సంబంధించిన వేప పువ్వు చింత పండు బెల్లం మామిడి ఉప్పు అరటిపండు కొబ్బరి కోరు మిరియాలు మొదలైన సహజ సిద్ధమైన వాటితో మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం.
ఈ పచ్చడిని షడ్రుచుల పచ్చడి అంటారు ఈ ఉగాది పచ్చడి వలన కోపం, హాస్యం, ఆశ్చర్యం, భయం, ధైర్యం మరియు సున్నితం వంటి చిహ్నములుగా భావిస్తారు.
పంచాంగ శ్రవణం
పంచాంగ శ్రవణం
కొత్త సంవత్సరం అయినందువలన ప్రజలందరూ వారి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ ఉగాది రోజున పండితులు వారి ప్రసంగాల ద్వారా ఆయా రాశుల స్థితిగతులను ఎలా ఉండేది చెప్పడం జరుగుతుంది. చాలా గ్రామాలలో ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని సాయంత్రం వేళల్లో ఆలయాల్లో జరిపిస్తారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అందరూ సాయంత్రం వేళ కలసి ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా వారి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని భావన కూడా ఉంది.
ప్రకృతి రమణీయం
ఈ చైత్రమాసం నుండే మనకు వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ వసంత రుతువు ఎంతో ఆహ్లాదకరంగాను ఎంతో నూతన ఉత్సాహాన్ని మనకు ప్రకృతి నుంచి ఇవ్వటం జరుగుతుంది ఈ మనసుకు ఎంతో ఉత్సాహంగాను ఉండటం జరుగుతుంది అలాగే కోకిల కిలకిలలు లేత మామిడి అప్పుడే రావటం చెట్లు చిగురిస్తూ ఉండటం అదేవిధంగా సన్నజాజులు మల్లెపువ్వు పరిమళాలతో నూతన వసంతంలోకి మన ఈ వసంతనుతో తీసుకొస్తుంది అందుకనే ఈ పండుగను ప్రకృతి పండుగ కూడా పిలుస్తారు.
రిఫరెన్స్
https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF

0 Comments